దేవర నీ దీవెనలు/ Devara Ni Deevenalu

దేవర నీ దీవెనలు 

ధారాళముగను వీరలపై 

బాగుగ వేగమే దిగనిమ్ము 

పావన యేసుని ద్వారగను          ||దేవర నీ||


దంపతులు దండిగ నీ

ధాత్రిలో వెలయుచు సంపదలన్

సొంపుగ నింపుగ పెంపగుచు 

సహింపున వీరు సుకించుటకై     ||దేవర నీ||


ఈ కవను నీ కరుణన్

ఆకరు వరకును లోకములో 

శోకము లేకయే ఏకముగా 

బ్రాకటముగను జేకొనుము              ||దేవర నీ||


ఇప్పగిది నెప్పుడును 

గొప్పగు ప్రేమతో నొప్పుచు దా

మొప్పిన చొప్పున దప్పకను 

మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్        ||దేవర నీ||


తాపములు పాపములు 

మోపుగ వీరిపై రాకుండగా 

గాపుగా బ్రాపుగ దాపునుండి 

యాపదలన్నియు బాపుచును            || దేవర నీ ||


సాధులుగన్ జేయుటకై 

శోధనలచే నీవు శోధింపగా 

కదలక వదలక ముదమున నీ 

పాదము దాపున బాదుకొనన్  || దేవర నీ ||


మెండుగ భూమండలపు 

గండములలో వీరుండగను 

తండ్రిగ దండిగ నుండనుండి 

వెండియు వానిని  ఖండించవే     || దేవర నీ ||


ఇద్దరు వీరందురును 

శుద్ధులై నిన్ను సేవించుటకై

శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్

దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్      || దేవర నీ ||


వాసిగ నీ దాసులము 

చేసిన ఈ మోరల్ దీసికొని 

మా సకలేశ్వర నీ సుతుడ

యేసుని పేరిట బ్రోవుమామేన్        || దేవర నీ ||

 



ENGLISH

Devara ni deevenalu 

Dhaaralamuganu veeralapai 

Baaguga vegame diganimmu 

Paavana Yesuni dwaaraganu 


Dampathulu dandiga ni 

Dhaathrilo velayuchu sampadhalan 

Sompuga nimpuga pempaguchu 

Sahimpuna veeru sukhinchutakai 


Ee kavanu nee karunan 

Aakaru varakunu lokamulo 

Shokamu lekaye ekamuga 

Braakatamuganu  chegonumu 



Ippagidhi neppudunu 

Goppagu prematho noppuchudaa 

Moppina choppuna dappakanu 

Moppuga brathukaga bampu krupan 



Thaapamulu paapamulu 

Mopuga veeripai raakundagaa 

Gaapuga braapuga dhaavunundi 

Aapadhalanniyu baapuchunu 


Saadhulugan cheyutakai 

Shodhanalache neevu shodhimpaga 

Kadalaka vadalaka mudhamuna ni 

Paadamu daapuna baadhukonan 


Menduga bhoomandalapu 

Gandamulalo veerundaganu 

Thandriga dandiga nundanundi 

Vendiyu vaanini khandinchave 


Iddaru veeriddarunu 

Shuddhulai Ninnu sevinchutakai 

Shraddhatho buddhiga siddhapadan 

Diddhumu ni priya biddalugan 


Vaasiga ni daasulamu 

Chesina ee moral deesikoni 

Maa sakaleshwara nee suthuda 

Yesuni perita bropumaamen