మహిమ ఘనతకు అర్హుడవు/ Mahima ghanathaku arhudavu


తెలుగు లో

మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము - 2 
సృష్టికర్త ముక్తి దాత - 2 
మా స్తుతులకు పాత్రుడా ...
ఆరాధనా నీకే... ఆరాధనా నీకే...
ఆరాధనా స్తుతి ఆరాధనా.. ఆరాధనా నీకే... - 2 
ఆరాధనా నీకే...ఆరాధనా నీకే... - 2

మన్నాను కురిపించినావు
బండనుండి  నీళ్లిచ్చినావు  || 2 ||
యెహోవా యీరే చూచుకొనును - 2
సర్వము సమకూర్చును...    ||ఆరాధనా ||

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు || 2 ||
యెహోవా రాఫా స్వస్థపరచును - 2
నను స్వస్థపరచును..       ||ఆరాధనా ||

IN ENGLISH 

Mahima ghanathaku arhudavu neeve naa Daivamu - 2
Shrushti kartha mukthi daatha - 2 
Ma sthuthulaku paathrudaa ... 
Aaraadhana neeke... aaraadhanaa neeke .. - 2 
Aaraadhana sthuthi aaraadhanaa.. aaraadhana neeke... - 2 
Aaaraadhana neeke... aaraadhana neeke... - 2 

Mannaanu kuripinchinaavu - banda nundi neelichhinaavu - 2 
Yehova Eerae choochukonunu - 2  
Sarvamu samakoorchunu... || aaraadhana neeke ||

Vyaadulanu tholaginchinaavu - mruthulanu mari lepi naavu ... - 2 
Yehova Rapha swastha parachunu - 2 
Nanu swastha parachunu .... || aaraadhana neeke || 



అన్ని నామములకన్న పై నామము యేసుని నామము/ Anni naamamula kanna pai naamamu Yesuni naamamu


తెలుగు లో

అన్ని నామములకన్న పై నామము  యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది క్రీస్తేసు నామము

యేసు నామము - జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లేలూయ హోసన్న హల్లేలూయ
హల్లేలూయ ఆమెన్

పాపముల నుండి విడిపించును - యేసుని నామము
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును -  క్రీస్తేసు నామము ||యేసు||


సాతాను పై అధికారమిచ్చును  -  శక్తి కలిగిన యేసు నామము
శత్రు సమూహము పై జయమిచ్చును జయ శీలుడైన యేసు నామము ||యేసు||


శరీర వ్యాధులన్ని బాగుచేయును - నజరేయుడైన యేసు నామము

సమస్త భాధలన్నీ తొలగించును - అభిశక్తుడైన యేసు నామము ||యేసు||

IN ENGLISH

Anni naamamula kanna pai naamamu Yesuni naamamu

Enni tharamulakaina ghanaparacha thaginadhi Kreesthesu naamamu




Yesu naamamu  jayam jayamu

Saathaanu shakthul layam layamu

Halleluya hosanna halleluya

Halleluya amen..



Paapamulanundi vidipinchunu -Yesuni naamamu

Nithya narakaagnilo nundi rakshinchunu - Kreesthesu naamamu || Yesu ||



sathaanu pai adhikaaramicchunu - shakthi kaligina Yesu naamamu

shathru samuhamupai jayamicchunu - jayasheeludaina Yesu naamamu || Yesu ||



Shareera vyaadhulanni baagucheyunu - Nazareyudaina Yesu naamamu

Samastha vyaadhulanni tholaginchunu - abhishakthudaina Yesu naamamu  || Yesu ||


ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా/ Oohaku andhani prema naa Yesu premaa


తెలుగు లో

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమా 2
తరాలెన్ని  మారినా యుగాలెన్ని  గడచినా - 2
జగాన మారనిది యేసు ప్రేమా - 2
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా 2

మనిషికి  మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం
మనుషులు మారినా 
మమతలు మారినా  
బంధాలు  వీడినా 
యేసు ప్రేమా మారదు 
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా - 2

జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమను వెతకటం దొరకకపోతే సంకటం - 2
మనుషుల ప్రేమ కొంచం 
 ప్రేమకు కూడా లంచం 
యేసు ప్రేమ శాశ్వతం 
జీవితానికే సార్థకం 
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా ...

IN ENGLISH


Oohaku andhani prema naa Yesu premaa

Velaku andhani prema naa Yesu premaa - 2

Tharaalenni maarinaa yugaalenni gadachinaa - 2

Jagaanaa maaranidhi Yesu premaa - 2

Premaa.. premaa.. na Yesu premaa..

Premaa.. premaa.. naa thandri premaa.. - 2



Manishini manishi preminchutaku swartham moola kaaranam

Deva neevu preminchutaku nee krupaye kaaranam - 2

Manushulu maarinaa

Mamathalu maarinaa

Bandhaalu veedinaa

Yesu prema maaradhu

Premaa.. premaa.. na Yesu premaa..

Premaa.. premaa.. naa thandri premaa.. - 2



Jeevithamantha poraatam edho teliyani aaraatam

Nithyam premanu vethakatam dorakakapothe sankatam - 2

Manushula prema koncham

Premaku kuda lancham

Yesu prema shashwatham

Jeevithanike saarthakam

Premaa.. premaa.. na Yesu premaa..

 Premaa.. premaa.. naa thandri premaa.. - 2

నిను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో/ Ninu stuthinchina chaalu na brathuku dinamulo


తెలుగు లో

నిను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడిన చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు      ||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను ||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
జాలిగల దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను ||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2 )
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను ||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)

నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)          ||నిను ||


IN ENGLISH 

Ninu sthuthinchina chaalu naa brathuku dinamulo 
Ninu pogadina chaalu naa gunde gudi lo.. (2)
Unna lekunna naa sthithigathule maarina
Nee sannidhilo ... 
Nee sannidhilo anandhinche bhaagyamunna chaalu  || Ninu ||

Sthuthulaku paathrudavu neevenaiyya 
Sthothraarhudavu neevenaiyya (2) 
Neevenaiyya naaku neevenaiyya (2)    || Ninu ||

Prema swaroopudavu neevenaiyya 
Jaaligala devudavu neevenaiyya (2) 
Neevenaiyya naaku neevenaiyya (2)   || Ninu ||

Aaraadhya daivamu neevenaiyya 
Ascharyakarudavu neevenaiyya (2) 
Neevenaiyya naaku neevenaiyya (2)    || Ninnu ||

Aadhisambhuthudavu neevenaiyya 
Aadharinchu devudavu neevenaiyya (2) 
Neevenaiyya naaku neevenaiyya (2)  || Ninnu ||